
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 02 నుంచి వైభవంగా జరుగనున్నాయి. జూన్ 10వ తేదీ వరకూ ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేప్టటింది. జూన్ 01వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలను అత్యంత వైభంగా జరుగనున్నాయి. ఈ క్రమంలోనే వాహన సేవల వివరాలను తెలుసుకుందాం.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
02.06. 2025.
ఉదయం – ధ్వజారోహణం
రాత్రి – పెద్దశేష వాహనం
03.06. 2025.
ఉదయం – చిన్నశేష వాహనం
రాత్రి – హంస వాహనం
04.06. 2025.
ఉదయం – సింహ వాహనం
రాత్రి – ముత్యపుపందిరి వాహనం
05.06. 2025.
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సర్వభూపాల వాహనం
06.06. 2025.
ఉదయం – మోహినీ అవతారం
రాత్రి – గరుడ వాహనం
07.06. 2025.
ఉదయం – హనుమంత వాహనం
రాత్రి – గజ వాహనం
08.06. 2025.
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
09.06. 2025.
ఉదయం – రథోత్సవం
రాత్రి – అశ్వవాహనం
10.06. 2025.
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం
