నవంబరు 15న శ్రీ కపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం

తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా పూజలు, హోమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారి హోమం నిర్వహిస్తున్నారు. ఇది నేటితో ముగియనుంది. ఈ పూజా మహోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. ఇక నవంబరు 15వ తేదీన కార్తీక పౌర్ణమి పర్వదినం. ఈ సందర్భంగా కపిలేశ్వర స్వామివారికి అన్నాభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఉదయం 2 గంట‌ల‌కు కపిలేశ్వర స్వామివారిని సుప్ర‌భాతంతో మేల్కొలిపి, 2.30 నుంచి 4.30 గంటల వరకు అభిషేకం, అలంకారం, అర్చ‌న నిర్వ‌హిస్తారు. మ‌ధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపడతారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన చేపడతారు. శుద్ధి అనంతరం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు సుగంధద్రవ్య అభిషేకం ఏకాంతంగా నిర్వహిస్తారు.

Share this post with your friends