శ్రీ కోనేటిరాయ స్వామివారి బ్రహ్మోత్సవాలు మే 5 నుంచి ప్రారంభం కానున్నాయని తెలిసిందే. మే 13 వరకూ ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. మే 4న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 గంటలవరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రాంభమవుతాయి. ఈ క్రమంలోనే రోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు అలాగే.. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా మే 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ .500/- చెల్లించి ఇద్దరు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. మే 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
తేదీ
05-05-2025
ఉదయం – ధ్వజారోహణం (కర్కాటక లగ్నం- మధ్యాహ్నం 12.05 నుండి 12.20 గంటల వరకు)
సాయంత్రం – పెద్ద శేష వాహనం
06-05-2025
ఉదయం – చిన్న శేషవాహనం
సాయంత్రం – హంస వాహనం
07-05-2025
ఉదయం – సింహ వాహనం
సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం
08-05-2025
ఉదయం – కల్పవృక్ష వాహనం
సాయంత్రం – సర్వభూపాల వాహనం
09-05-2025
ఉదయం – మోహినీ ఉత్సవం
సాయంత్రం – శ్రీవారి కల్యాణోత్సవం, గరుడ వాహనం
10-05-2025
ఉదయం – హనుమంత వాహనం
సాయంత్రం – వసంతోత్సవం, గజ వాహనం
11-05-2025
ఉదయం – సూర్యప్రభ వాహనం
సాయంత్రం – చంద్రప్రభ వాహనం
12-05-2025
ఉదయం – రథోత్సవం
సాయంత్రం – అశ్వవాహనం
13-05-2025
ఉదయం – చక్రస్నానం
సాయంత్రం – ధ్వజావరోహణం