దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల వినాయక నిమజ్జనం కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న రాత్రి ముంబయిలో గణేష్ విగ్రహ నిమజ్జన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమంలో నీతా అంబానీతో పాటు కుటుంబం మొత్తం పాల్గొంది. అనంత్ అంబానీ, ఆయన భార్య రాధిక మర్చంట్‌లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ వేడుకలో నీతా అంబానీతోపాటు కుటుంబం మొత్తం పాల్గొని వైభవంగా గణపతి బప్పాకు వీడ్కోలు పలికారు. వినాయక చవితి నాడు అంబానీ ఫ్యామిలీ గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించారు.
పూల రథంపై గణేశుడిని నిమజ్జనానికి తీసుకెళ్లారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఇంటి ఆంటిలియా నుంచి జేజేలు పలుకుతూ అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌లు వీడ్కోలు పలికారు. ట్రక్‌పై నీతా అంబానీ నిలుచోవడం ఆసక్తిని రేకెత్తించింది. ఇక అంబానీ కుటుంబం వీధుల్లో ప్రజలకు స్వీట్లను పంచుతూ ఆసక్తికరంగా గడిపారు. ఇక వినాయక నిమజ్జన వేడుకల్లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల కాస్ట్యూమ్స్ కూడా ఆసక్తిని రేకెత్తించింది. అనంత్ అంబానీ దంపతులు గణపతికి హార ఈ సందర్భంగా రాధిక ఎంబ్రాయిడరీ మోడల్ నీలం రంగు డ్రెస్ ధరించగా, అనంత్ నారింజ రంగు కుర్తా పైజామా ధరించారు. ఈ వినాయకుడిని ప్రతిష్టించిన రోజు కూడా అనంత్ అంబానీ దంపతులు హాజరై స్వామివారికి తొలి హారతి ఇచ్చారు. ఇక గత రాత్రి ఆనందంగా వీడ్కోలు పలికారు.