శ్రీనివాసమంగాపురం బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం..

శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 8 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 16వ తేది వరకూ జరగనున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలకు స్వామివారి ఆలయం సిద్ధమైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

08-02-2026
ఉదయం – ధ్వజారోహణం ( కుంభ ల‌గ్నం- ఉ. 8.15 నుండి 8.35 గంటల వరకు)
రాత్రి – పెద్దశేష వాహనం
09-02-2026
ఉదయం – చిన్నశేష వాహనం
రాత్రి – హంస వాహనం
10-02-2026
ఉదయం – సింహ వాహనం
రాత్రి – ముత్యపుపందిరి వాహనం
11-02-2026
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సర్వభూపాల వాహనం
12-02-2026
ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)
రాత్రి – గరుడ వాహనం
13-02-2026
ఉదయం – హనుమంత వాహనం
మధ్యాహ్నం- వసంతోత్సవం (మ. 2 నుండి 3 గంటల వరకు)
సాయంత్రం – స్వర్ణరథం(సా. 4 నుండి 5 గంటల వరకు)
రాత్రి – గజ వాహనం
14-02-2026
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
15-02-2026
ఉదయం – రథోత్సవం
రాత్రి – అశ్వవాహనం
16-02-2026
ఉదయం – చక్రస్నానం(ఉ. 9.55 నుండి 10.15 గంటల వరకు)
రాత్రి – ధ్వజావరోహణం( సా. 6 నుండి రాత్రి 7 గంటల వరకు)

Share this post with your friends