108 కేజీల పంచదారతో బాల త్రిపుర సుందరి అమ్మవారికి అభిషేకం

Bhimavaram : భీమవరం మెంటేవారి తోటలోని శ్రీవిజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాల త్రిపుర సుందరి అమ్మవారికి ఆదివారం 108 కేజీల పంచదారతో అభిషేకం నిర్వహించారు. పట్టణానికి చెందిన విష్ణువర్ధల సత్య సుబ్రహ్మణ్యం, లక్ష్మీ శైలజ దంపతులచే అమ్మవారికి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఎండలు తగ్గాలని వర్షాలు కురవాలని కోరుకుంటూ 108 కేజీల పంచదారతో అభిషేకాలు చేసినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ తెలిపింది. అనంతరం పంచదారతో ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Share this post with your friends