శ్రీకృష్ణుడికి కానుకగా వెండి రివాల్వర్..

భగవంతుడికి భక్తులు ఏదో ఒక రూపంలో కానుకలు సమర్పించడం సర్వసాధారణం. డబ్బు రూపంలోనో.. బంగారం గానో.. మరో రకంగానో తాము నమ్మిన దైవానికి మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. కానీ శ్రీకృష్ణ పరమాత్ముడికి ఓ భక్తుడు సమర్పించిన కానుక గురించి తెలిస్తే షాకవుతారు. రాజస్థాన్‌లోని చిత్తౌడ్‌గఢ్‌ జిల్లాలో గల ప్రసిద్ధ సావరియా సేఠ్‌ ఆలయంలో శ్రీకృష్ణుడు కొలువై ఉన్నాడు. ఈ క్రమంలోనే మూలవిరాట్టుగా శ్రీకృష్ణుడు కొలువై ఉన్నాడు. ఆయనకు ఓ అజ్ఞాత భక్తుడు వెండి రివాల్వరు, తుపాకీ గుండు కానుకగా సమర్పించాడు.

అవును.. మీరు విన్నది నిజమే. అరకిలో బరువున్న వెండి రివాల్వర్‌తో పాటు తుపాకీ గుండును కానుకగా సమర్పించాడు. వీటితోపాటు రెండు వెండి వెల్లుల్లిపాయలను కూడా హుండీలో వేశాడు. ఇలా భగవంతుడికి ఆయుధాన్ని సమర్పించడం ఇదే తొలిసారని సావరియా సేఠ్ ఆలయ చైర్మన్ వెల్లడించారు. ఈ కానుకను భగవంతుడికి సమర్పించిన భక్తుడెవరో తెలియదు. అయితే గతేడాది రాజస్థాన్‌లో వెల్లుల్లి ధరలు బాగా పెరిగాయి. ఈ క్రమంలోనే అక్కడి రైతులకు వెల్లుల్లి భారీగా లాభాలు ఆర్జించి పెట్టింది. ఓ రైతు దేవుడికి ఇలా కానుకను సమర్పించి ఉండొచ్చని అక్కడి వారు భావిస్తున్నారు. ఇక్కడ కన్నయ్యను సంపదు అధిపతిగా ‘సేఠ్’ అని భక్తులు కొలుచుకుంటారు.

Share this post with your friends