
నేడు (ఆదివారం) చంద్రగ్రహణం కారణంగా నిన్ననే దేశ వ్యాప్తంగా గణేశుడి నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. పది రోజుల పాటు అంగరంగ వైభవంగా పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ొడికి చేరిపోయాడు. జై బోలో గణేష్ మహారాజ్‌కి జై.. గణపతి బప్పా మోరియా.. ఆగ్లే సాల్ జల్దీ ఆవో నినాదాలతో దేశమంతా మారుమోగిపోయింది. ఇక వినాయకచితి పండుగ అన్నా.. నిమజ్జనం అన్నా కూడా ముంబై తర్వాతే ఏదైనా. ముంబైలోని లాల్బాగ్ చ రాజా పండల్‌కు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి వినయకుడిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు.
ఈ లంబోదరుడి నిమజ్జనం సైతం అత్ంత వైభవంగా జరుగుతుంది. నిన్న దేశంలోని నిమజ్జన కోలాహలమంతా ముంబైలోనే కనిపించింది. లాల్బాగ్ చ రాజా పండల్ నుంచి వినాయకుడి విగ్రహా శోభాయాత్రకు ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు హాజరయ్యారు. భక్తుల పాటలు, నృత్యాలు, కోలాహలం నడుమ గణనాథుడు నిమజ్జనానికి తరలివెళ్లాడు. లాల్బాగ్ చ రాజా పండల్ శోభాయాత్ర ముంబై నగరంలో ఉత్సాహాన్ని నింపింది. ఈ శోభాయాత్రలో రాఫెల్ ఫైటర్ జెట్ నమూనా కలిగిన జెట్‌తో గణనాథుడిపై పూల వర్షం కురిపించడం మరింత ఆసక్తికరం. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున జనాలు రోడ్లపైకి చేరడంతో ముంబైలోని పలు ప్రాంతాలు జనాలో కిక్కిరిసిపోయాయి.
