మహాకుంభమేళాలో 144 ఏళ్ల బాబాజీ మృతి

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. దీనికి సంబంధించి అనేక వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కుంభమేళాకు వస్తున్న, వచ్చిన పలువురు వ్యక్తుల గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా ఒక వ్యక్తికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆయనొక 144 ఏళ్ల సాధువు. ఆయన మరణించాడని పేర్కొంటున్న వీడియో అది. డియోలో ఓ సన్యాసి బ్రహ్మలీనంగా మారడం కనిపిస్తోంది. ఆ వీడియోలో అతని మృతదేహానికి తుది ప్రక్రియకు సంబంధించిన పోస్టర్ అది.

ఆయన పేరును సోషల్ మీడియాలో జునా అఖారా అని పేర్కొనడం జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ఆ సాధువుకు సంబంధించిన వివరాలను పేర్కొనడం జరిగింది. ఆ సాధువు వయస్సు 144 సంవత్సరాలు అని, అతను మహాకుంభమేళాలో తుది శ్వాస విడిచాడని పేర్కొన్నారు. 144 ఏళ్ల తర్వాత వచ్చే మహాకుంభమేళాలో 144 ఏళ్ల గురూజీ తన జీవితాన్ని త్యాగం చేశాడని అంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియా యూజర్ బాబాజీ అదృష్టవంతుడని కొందరు.. చివరి క్షణాల్లో ఆసుపత్రికి తీసుకెళ్లి ఉండాల్సిందంటూ మరొకరు వ్యాఖ్యలు చేస్తున్నారు.

Share this post with your friends