12 గంటల పాటు నిరంతరంగా ఉపనిషత్తుల సందేశం

తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్ సౌజన్యంతో ఒక మహత్తర కార్యక్రమానికి తెరదీయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రేపు ముహూర్తం ఖరారు చేశారు. జాతీయ గీతా ప్రచార సమితి వారి ఆధ్వర్యంలో జూన్ 11న తిరుపతి, అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 07 గంటలకు ఉపనిషత్తులపై సందేశం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం రాత్రి 07.00 గంటల వరకూ నిరంతరాయంగా జరుగనుంది.

అంటే 12 గంటల పాటు ఏకధాటిగా ఉపనిషత్తుల సందేశంపై వ్యాఖ్యానం జరుగనుంది. ఈ కార్యక్రమానికి పౌరాణిక శిరోమణి మరియు ధర్మ ప్రచార పరిషత్ ప్రొగ్రాం అసిస్టెంట్ శ్రీ పొన్నా కృష్ణమూర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమంలో తైత్తిరీయోపనిషత్, మాండూక్యోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, కేనోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, కఠోపనిషత్తు అంశాలపై నిర్విర్వామంగా వ్యాఖ్యానించనున్నారు.

Share this post with your friends