ఏలిననాటి శని కారణంగా ఇబ్బందులు పడుతున్న మీనరాశి వారికి గుడ్ న్యూస్..

ఈ నెలలో కొన్ని రాశుల వారిని అదృష్టం వరించబోతోంది. ముఖ్యంగా గురు సంచారం కారణంగా ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న రాశులకు సైతం కలిసి రానుంది. ఆగస్టు 13న గురువు పునర్వసు నక్షత్రం మొదటి పాదంలోకి.. తిరిగి ఆగస్టు 30న పునర్వసు రెండవ పాదంలో సంచారం చేయనున్నాడు. గురువు రెండు సార్లు సంచారంతో కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారం కానుంది. ఆ రాశులేంటంటే.. మేషం, కర్కాటక, మీనరాశి వారికి కలిసి రానుంది. మేష రాశివారికి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అన్ని విధాలుగా అభివృద్ధి, విద్యార్థులకు చదువులో బాగా కలిసొస్తుంది. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థికంగా ఈ రాశివారందరికీ చాలా బాగుంటుంది. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు.

కర్కాటక రాశివారికి సైతం గురు గ్రహ మార్పు కారణంగా పరిస్థితులన్నీ సానుకూలంగా మారనున్నాయి. మానసిక ప్రశాంతతతో పాటు ఇంట్లో, కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. కొత్త వాహనం, ఆస్తి కొనుగోలు ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. భార్యాభర్తల మధ్య బంధం బాగుంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులననీ పూర్తవుతాయి. ఇక మీనరాశికి అధిపతి గురువు కాబట్టి వీరికి పట్టిందల్లా బంగారమే. ఆధ్యాత్మిక కార్యక్రమంలో లేదంటే శుభకార్యాలలో పాల్గొంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం చేస్తున్న వారు పెట్టుబడుల నుంచి మంచి లాభాలు, ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. చాలా కాలంగా ఏలిన నాటి శని కారణంగా ఈ రాశి వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఈ సమయం వ్యక్తులకు పురోగతి, స్థిరత్వం, శ్రేయస్సు వైపు పయనిస్తారనడంలో సందేహం లేదని జోతిష్య పండితులు చెబుతున్నారు.

Share this post with your friends