అక్టోబర్ ఆన్లైన్ భక్తి పత్రిక వెలువడింది.. ఇక ఆలస్యం చేయకుండా కోనేయండి..!

దక్షిణాయనంలోని భాద్రపదం పూర్తి కావచ్చింది. భాద్రపద మాస కృష్ణపక్షాన్ని మహాలయ పక్షం అంటారు. చివరి రోజును మహాలయ అమావాస్య (అక్టోబర్ 2) అంటారు. ఆ రోజునే తెలంగాణలో బతుకమ్మ సంబురాలు మొదలవుతాయి. ఈ ఋతువులో పూచే పూలను సేకరించి… వర్తులాకారంలో పేర్చుతారు. దానికి బతుకమ్మ అని పేరు. అమ్మవారికి వలెనే ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు. అన్ని ఇళ్లనుంచి స్త్రీలు బతుకమ్మలను నెత్తిమీద పెట్టుకుని వస్తారు. ఒక కూడలిలో అందరి బతుకమ్మలను ఉంచి… వాటి చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో బతుకమ్మలకు ఆనందం కలిగిస్తారు. అనంతరం పారేనీటిలో బతుకమ్మలను నిమజ్జనం చేస్తుంటారు. ఇది మహార్నవమి వరకు సాగే వేడుక, ఆశ్వయుజ మాసం మొదటిరోజు నుంచి పదోరోజు వరకు దసరా ఉత్సవాలు.

Click Here For October 2024 Bhakthi Magazine Online Edition

జగన్మాతను విశేషంగా ఆరాధించే దసరా ఉత్సవాలనే శరన్నవరాత్రులు అంటారు. దసరాలతో శరత్ ఋతువు ప్రారంభం అవుతుంది. ఆరు ఋతువులు ప్రారంభకాలాన్ని మనవారు యముని కోరల వంటి కాలాలు అంటారు. ఆ సమయంలో ప్రత్యేక పూజలు చేయడం, ఆహార నియమాలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దసరాల్లో మూల నక్షత్రం నాడు సరస్వతీపూజ నిర్వహిస్తారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి ముఖ్యమైన పండుగలు. దసరా రోజుల్లో ముఖ్యంగా విజయవాడ కనకదుర్గ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. అన్ని శక్తి క్షేత్రాల్లోనూ బ్రహ్మోత్సవాలు, విశేషోత్సవాలు జరుగుతుంటాయి. దసరా రోజుల్లో కొందరు దీక్షగా పూజలు చేస్తారు. మరికొందరు శక్తి ఆలయాలను సందర్శిస్తారు. ఎలా పూజించినా జగన్మాత కరుణను అందరికీ లభిస్తుంది. ఆశ్వయుజమాసం చివరిలో దీపావళి అమావాస్య (అక్టోబర్ 31) వస్తుంది. బాణసంచా కాల్పులతో అంగరంగ వైభవంగా జరుపుకునే దీపావళి పండుగ అంటే పెద్దలకు. పిల్లలకూ కూడా ఇష్టమే. ఈ దీపావళిని శబ్దకాలుష్యానికి, వాయుకాలుష్యానికి దూరంగా ఆనందంగా జరుపుకుందాం.

ఇలా అనేక అంశాలతో అక్టోబర్ ఆన్లైన్ భక్తి పత్రిక వెలువడింది. కొన్న వారికి తక్షణమే తమ DASHBOARD లోకి పత్రిక వచ్చేస్తుంది. అందులోని పర్వదినాలను సద్వినియోగం చేసుకోండి. మన సేవలను అందుకుని ఆ దేవతలందరూ మనందరికీ ఆయురారోగ్యాలను, సకల శుభాలను కలిగించాలని వేడుకుందాం.

ఇక్కడ క్లిక్ చేయండి.. అక్టోబర్ ఆన్లైన్ భక్తి పత్రికను పొందండి..!

Share this post with your friends