సూర్యగ్రహణం కాబట్టి భారత్‌లో సూతకాలం ఉంటుందా?

ఈ ఏడాది రెండవది.. చివరి సూర్య గ్రహణం రేపు ఏర్పడనుందని తెలుసుకున్నాం. ఇక సూర్యగ్రహణ సమయంలోనే రింగ్ ఆఫ్ ఫైర్ కూడా ఏర్పడనుందని తెలుసుకున్నాం. అసలు రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. వార్షిక సూర్యగ్రహణం సమయంలో చంద్రుని నీడ సూర్యునిపై పడినప్పుడు రింగ్ ఆకారంలో దృశ్యం కనిపిస్తుంది. ఇది చూడటానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ వలయాకార కాంతి చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ప్రతి గ్రహణ సమయంలోనూ కనిపించదు. దీనిని సైన్స్ భాషలో యాన్యులర్ సొలార్ ఎక్లిప్స్ అని కూడా అంటారు.

ఒక్కోసారి ఇలాంటి అరుదైన దృశ్యం ఏడాదికి ఒకసారి మాత్రమే కనిపిస్తుంది. అలాంటి అరుదైన, అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక సూర్యగ్రహణం రాత్రివేళ సంభవిస్తుంది కాబట్టి భారత్‌లో కనిపించే అవకాశం లేదు. కాబట్టి రింగ్ ఆఫ్ ఫైర్‌ను చూసే అవకాశం కూడా లేదు. సూర్యగ్రహణ సమయాన్ని సూతకాలంగా భారతీయులు చూస్తుంటారు. సూలత కాలం అంటే శుభ కార్యాలు, పూజా కార్యక్రమాలను నిషేధించే సమయం. ఈ సమయంలో దేవాలయాలను సైతం మూసివేస్తారు. ఇక భారత్‌లో సూర్యగ్రహణ ప్రభావం ఉండదు కాబట్టి సూతకాలం కూడా ఉండదు.

Share this post with your friends