పామును చూడగానే ఒళ్లు భయంతో కంపించిపోతుంది. పల్లెటూర్లలో అయితే అప్పుడప్పుడు ఇళ్లలోకే వస్తుంటాయి. పాములు ఇలా ఇంట్లోకి రావడం, కంటికి కనిపించడం అశుభంగా భావిస్తుంటారు. మరికొందరు ఇంట్లోకి పాము వస్తే నాగదేవతే వచ్చిందని భావించి పూజలు చేస్తారు. అయితే పాము ఇళ్లలోకి రావడం వెనుక ఏదైనా కారణం ఉందా? అసలు అది శుభమా అశుభమా? అనేది తెలుసుకుందాం. ఇంట్లో నల్లపాము కనిపిస్తే అది శుభసంకేతమేనట. ఇవి ఎవ్వరికీ హాని చేయవు. వీటిని ఏమీ చేయకుండా వీలైతే తీసుకెళ్లి దూరంగా వదిలేయడం ఉత్తమం. గోధుమ రంగు పాము ఇంట్లోకి వస్తే పరమ శివుని ఆశీస్సులు పొందుతారట. ఆర్థికంగా మంచి ప్రయోజనకరంగా ఉంటాయి.
కొన్ని సార్లు నలుపు, గోధుమ రంగు పాములు కలగలిసి కనిపిస్తుంటాయి. అవి దంపతుల మధ్య ప్రేమానురాగాలకు చిహ్నమట. అవి ఇంట్లోకి వస్తే సంతాన భాగ్యం కలుగుతుందట. ఇంట్లో తెల్ల పాము కనిపిస్తే చాలా అదృష్టమట. కానీ ఇది అరుదుగా జరుగుతుంది. తెల్లటి వెండి వర్ణం గల పాము మీ ఇంటి ఆవరణలో గానీ.. ఇంట్లోకి గానీ వస్తే ఆర్థికంగా బాగా కలిసొస్తుందట. పసుపు పాము ఇంట్లో కనిపిస్తే దానిని జీవితంలో ఎదగడానికి సంకేతంగా భావిస్తారు. ఇంట్లో ఆకుపచ్చ పాములు కూడా ఉంటాయి. అవి ఇంట్లోకి వస్తే జీవితంలోని అన్ని సమస్యలు పరిష్కారమవడంతో పాటు త్వరలోనే మీకు మనశ్శాంతి కలిగి సుఖసంతోషాలు నెలకొంటాయట.