Saturn’s Transit In Birth Chart : జాతకంలో ఏలినాటి శని ఉంటే పనులు అవ్వవా?

ఏలినాటి శని గురించి వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే దాని ఫలితం అలా ఉంటుంది. అయితే అంత ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిని ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో ఫేస్ చేయాల్సిందే. ఏడున్నరేళ్లపాటు ఒక్కొక్కరి జీవితంలో ఏలిన నాటి శని ఉంటుంది. ఆ సమయంలో మనం శనీశ్వరుడిని తిట్టుకుంటూ ఉంటాం. కానీ అలాంటి అవసరం లేదట. శని ఆయుఃకారకుడు. మందగమనుడు గనక తలపెట్టిన పనులను కాస్త ఆలస్యం చేస్తాడే తప్ప అసలు చేయకుండా ఉండడని చెబుతారు.

Saturn's Transit In Birth Chart : జాతకంలో ఏలినాటి శని ఉంటే పనులు అవ్వవా?
Saturn’s Transit In Birth Chart : జాతకంలో ఏలినాటి శని ఉంటే పనులు అవ్వవా?

పెళ్లిళ్లు, పదోన్నతులు వంటి శుభ కార్యాలేవైనా కూడా కేవలం శని మూలంగా ఆగవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అవి కావడం లేదంటే శనే కాకుండా జాతకంలో ఇతర గ్రహ ప్రభావాలూ ఉంటాయనేది గుర్తించాలట. ఏలినాటిని ఏడునాడు అని కూడా అంటారు. నాడు అంటే అర్ధ‌భాగం.. ఏడునాడు అంటే ఏడున్నరేళ్లు అని అర్థం. జాతకచక్రంలో 12 రాశులుంటాయి. గ్రహాలు ఒక్కొక్కరి రాశిలో ఒక్కో సమయంలో సంచరిస్తూ ఉంటాయి. ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయంలో గ్రహ ప్రభావం ప్రారంభమవుతుంది. 12, 1, 2 స్థానాల్లో శని గ్రహం ప్రవేశించి.. ఒక్కోస్థానంలో శని రెండున్నరేళ్లు ఉంటుంది.

Share this post with your friends