కొత్తగా ఇల్లు కడుతున్నారా అయితే పూజ గది కట్టేటప్పుడు పాటించాలిసిన నియమాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..!

దేవుని విగ్రహాలు తూర్పు లేదా పడమర దిశలో ఉండాలి. తద్వారా ప్రార్థన చేసే వ్యక్తి తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టి పూజ చేయవచ్చు. పూజ గది గోడలకు తెలుపు, లేత పసుపు లేదా లేత నీలం వంటి లేత రంగులను ఉపయోగించడం మంచిది. పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా, చిందరవందర లేకుండా ఉంచాలి. ఇది సానుకూల శక్తి ప్రవాహానికి సహాయపడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
