How To Reduce The Influence Of Saturn : శని ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవచ్చంటే..

ఏలిననాటి శని మన రాశిలో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు వస్తుంటాయి. ఆర్థిక ఇబ్బందులు, మంచి స్థానం నుంచి అథమ స్థానానికి వెళ్లిపోవడం.. ప్రాణభయం వంటివన్నీ కలుగుతాయి. అయితే శని మన రాశిలోకి ప్రవేశించినా కూడా కొన్ని మంచి పనులకు దోహదం చేస్తాడని చెబుతారు. వివాహం, ఉద్యోగం లభించడం వంటివైతే జరుగుతాయట. కానీ వాటితో పాటే చాలా ఇబ్బందులు సైతం తలెత్తుతాయట. ఇంటి నిర్మాణం పూర్తి చేసినా కూడా తద్వారా దారుణమైన ఆర్థిక కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులు చాలా ఉంటాయి కాబట్టి అంతా జాతకంలో ఏలిన నాటి శని ఉందంటే ఆందోళన చెందుతుంటారు.

How to reduce the influence of Saturn : శని ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవచ్చంటే..
How to reduce the influence of Saturn : శని ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవచ్చంటే..

శని ప్రభావ తీవ్రత తగ్గించేందుకు పెద్దవాళ్లు చాలా మార్గాలు సూచించారు. వీలైతే నిత్యం విష్ణుసహస్రనామం, సుందరాకాండ పారాయణం, ఆదిత్యహృదయంలలో ఏదో ఒకటి పారాయణం చేస్తే మంచిది. అలాగే భతవంతుని ఆరాధన, తీర్థయాత్రలు, వ్రతాలు ఆచరిస్తే మంచిదట. శనివారం నవగ్రహాలయానికి వెళ్లి.. నవ గ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. అలాగే శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇలా తొమ్మిది వారాలు చేయాల్సి ఉంటుంది. చేస్తే శనిదోషాలన్నీ తొలగిపోతాయట. అలాగే పక్షులకు, ఆవులకు ఆహారం వేసినా.. నల్ల చీమలకు చక్కెర వేసినా.. పరమేశ్వరుని పంచాక్షరీ మంత్రాన్ని జపించినా శని ప్రభావాన్ని తగ్గించవచ్చు.

Share this post with your friends