ఛోటీ దీపావళిని నరక చతుర్దశిగా పిలవడానికి కారణమేంటి?

నరక చతుర్దశిని ఛోటీ దీపావళిగా పిలుచుకుంటాం. దీనికి కారణమేంటన్న ఆలోచన రాకుండా పోదు. అయితే ఇలా పిలవడానికి కొన్ని పురాణ కథలు ఉన్నాయి. దీనిలో అత్యంత ముఖ్యమైనది నరక సంహారం. నరకాసురుడిని సత్యభామతో కలిసి శ్రీకృష్ణ పరమాత్మను సంహరించిన రోజున ఛోటీ దీపావళి జరుపుకుంటాం. నరకాసురుడు తను పొందిన వరంతో గర్వం విపరీతంగా వచ్చేసింది. దీంతో ముల్లోకాలను హింసించడం ప్రారంభించాడు. సాధారణ స్త్రీలతో పాటు రాజ కుమార్తెలను సైతం హింసించేవాడు. ఇది చాలదన్నట్టుగా దేవతలను బందీగా చేసుకున్నాడు.

నరకాసుర దురాగతాలు పెచ్చుమీరడంతో దేవతలంతా శ్రీకృష్ణుడికి మొర పెట్టుకున్నారు. ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున శ్రీ కృష్ణుడు నరక సంహారానికి ముహూర్తం పెట్టాడు. ఆరోజున కన్నయ్య.. సత్యభామతో కలిసి నరకాసురుడిని సంహరించి దేవతలను, సుమారు 16 వేల మంది స్త్రీలను అతని చెర నుండి విడిపించాడు. నరకాసుర వధతో ప్రజలందరికీ విముక్తి లభించినట్టుగా అయ్యింది. దీంతో ప్రజలంతా దీపాలు వెలిగించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అప్పటి నుంచి నరక చతుర్దశిని ఛోటీ దీపావళిగా పిలుచుకుంటూ పండుగ చేసుకుంటున్నాం.

Share this post with your friends