భీమేశ్వరాలయంలో ముందుగా శివలింగం ఏ భాగాన్ని దర్శించుకోవాలంటే..

భీమేశ్వరాలయానికి కార్తీక మాసంలో భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఇక్కడ కుమారస్వామి ఆత్మలింగాన్ని ప్రతిష్టించాడని తెలుసుకున్నాం కదా.. ఈ ఆలయాన్ని చాళుక్య భీముడు నిర్మించాడు కాబట్టి దీనిని భీమేశ్వరాలయం అని పిలుస్తారు. ఇక్కడి ఆలయంలో పరమేశ్వరుడు ఆత్మలింగం రూపంలో బాలా త్రిపుర సుందరీ దేవి సమేతుడై భక్తులకు దర్శనమిస్తాడు. ముందుగా ఈ ఆలయానికి వెళ్లిన వారు కోనేటిలో స్నానమాచరించి అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. ఈ దేవాలయంలో ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి.

కాల భైరవుడు, మహాకాళి, వీరభద్రుడు, వినాయకుడు, శనేశ్వరుడు, నవగ్రహ ఆలయాలు భీమేశ్వరాలయంలో ఉపాలయాలుగా ఉన్నాయి. గర్భగుడిలోని శివలింగానికి అభిముఖంగా ఏక శిలపై రూపుదిద్దుకున్న నంది విగ్రహం ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులంతా ముందుగా మొదటి అంతస్తులో ఉండే శివలింగం పై భాగాన్ని దర్శించుకున్న మీదట పాద భాగాన్ని దర్శించుకుంటారు. చైత్ర, వైశాఖ మాసాల్లో సూర్య కిరణాలు ఉదయం వేళలో స్వామి వారి పాదాలను, సాయంత్రం వేళ అమ్మవారి పాదాలను తాకుతాయి. దీనిని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వస్తుంటారు. ప్రతి ఏటా శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశినాడు, భీమేశ్వరుడు, బాలా త్రిపుర సుందరీ దేవిల వివాహం జరిపిస్తారు.

Share this post with your friends