
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని కేరళపురంలో శ్రీ మహాదేవ ఆలయంలోని వినాయకుడి గురించి ఇప్పటికే మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఆ ఆలయంలోని మిరాకిల్స్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం కొన్ని శతాబ్దాల క్రితం నాటిది. కచ్చితంగా చెప్పాలంటే.. ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని శాసనాలు చెబుతున్నాయి. 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారట.
ఎన్నో మిరాకిల్స్‌కు నెలవైన ఈ వినాయకర్ ఆలయం వాస్తవానికి శివాలయం. అందుకే దీనిని మహాదేవ ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తరువాత ఆలయ నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగింది. ఆ తరువాతే వినాయకుడి ప్రతిష్ట జరిగిందని చెబుతారు. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని అంటారు. గణేశుడి విగ్రహం సముద్రంలో దొరికిందని చెబుతారు. ఇక్కడి గణేశుడి విగ్రహం వెనుక పెద్ద కథే ఉంది. అది కూడా మరో కథనంలో తెలుసుకుందాం.
