హంసలదీవి ప్రత్యేకత ఏంటంటే..

హంసలదీవిని సాగర సంగమ ప్రదేశం అని కూడా పిలుస్తారు. మహారాష్ట్రలో పుట్టిన కృష్ణా నది.. దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. కృష్ణానదిలోని ఒక పాయ కోడూరు సమీపంలోని హంసల దీవి వద్ద సముద్రంలో కలుస్తుంది. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం నది సముద్రంలో కలిసే చోటు చాలా పవిత్రమైనది.. అలాంటి పవిత్ర సాగర సంగమంలో స్నానమాచరిస్తే జన్మాంతర పాపాలు సైతం తొలగిపోతాయట. ఇంతటి పవిత్ర ప్రదేశమే.. కృష్ణా జిల్లాలోని హంసలదీవి. ఇక్కడ స్నానమాచరిస్తే జన్మాంతర పాపాలు సైతం తొలగిపోతాయని నమ్మకం.

హంసల దీవి దగ్గర కృష్ణానది బంగాళాఖాతంలో కలుస్తుంది. అందుకే దీనిని పవిత్ర సాగర సంగమ ప్రదేశంగా చెబుతారు. అంతటి పవిత్రమైన ప్రదేశంలో రుక్మిణి సమేత వేణుగోపాలస్వామి కొలువుదీరారు. ఇక్కడ సకల పాపాలు తొలగించే గంగమ్మ సైతం స్నానమాచరించి సకల పాపాలను పోగొట్టుకుందని స్థల పురాణం చెబుతోంది. 1995 ప్రాంతంలో ఈ ఆలయాన్ని బెజవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం వారు దత్తత తీసుకున్నారు. అనంతరం ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించారు. ఇక్కడ ఏటా అత్యంత వైభవంగా స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

Share this post with your friends