దేవతలంతా శ్రీ వేణుగోపాల స్వామికి ఆలయాన్ని నిర్మిస్తుండగా ఏం జరిగిందంటే..

పాపభారంతో నల్లగా మారిపోయిన గంగమ్మ.. శ్రీ మహావిష్ణువు సలహా మేరకు పవిత్ర తీర్థాల్లో స్నానమాచరిస్తూ కృష్ణా నది వద్దకు వచ్చి అక్కడ స్నానమాచరించింది. అక్కడ ఆమె నలుపంతా పోయి తెల్లగా హంసలా మారిపోయింది. అయితే ఈ విషయం తెలిసిన దేవతలంతా భూలోకానికి వచ్చి హంసలదీవిలో స్నానమాచరించారు. స్నానానంతరం అక్కడే దేవతలంతా కలిసి రుక్మిణి సమేత వేణుగోపాల స్వామిని ప్రతిష్టించి పూజించారు. అనంతరం ఒక్క రాత్రిలోనే వేణుగోపాల స్వామి కోసం ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి.

అయితే దేవతలంతా కలిసి ఆలయాన్ని నిర్మిస్తుండగా తెల్లవారిపోయి కోడి కూసే వేళకు ఒక వ్యక్తి వారిని చూశాడట. అంతే వారంతా శిలలుగా మారిపోయారట. ప్రస్తుతం మనకు ఆలయంలో కనిపించే శిల్పాలన్నీ సజీవ శిల్పాలేనని పురాణాలు చెబుతున్నాయి. ఆలయ రాజగోపురం చాలా కాలం వరకూ అసంపూర్తిగా ఉండిపోయిందట. అదే దేవతలంతా శిలలుగా మారిపోయారనేందుకు నిదర్శనమని చెబుతారు. దేవతలు ప్రతిష్టించిన రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయం అత్యంత మహిమాన్వితమైనదిగా చెబుతారు.

Share this post with your friends