కామాక్షి తాయి అమ్మవారి ఆలయ విశేషాలేంటంటే..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సమీపంలోని జొన్నవాడ గ్రామంలో కామాక్షి తాయి అమ్మవారి ఆలయంలో శ్రీ చక్రాన్ని ఆది శంకరాచార్యులు ప్రతిష్టించిన విషయం తెలిసిందే. అయితే శ్రీ చక్రాన్ని అమ్మవారి పాదాల చెంత ఆయన ప్రతిష్టించారు. దీనికి ముందు శ్రీ చక్రానికి తన శక్తినంతటినీ ధారపోసినట్టు తెలిపారు. అమ్మవారు తన ఉగ్ర స్వరూపాన్ని విడిచి భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా జొన్నవాడలోనే ఉండాలని కోరడంతో అమ్మవారు ఆ కోరికను మన్నించి అక్కడే ఉండిపోయిందట. తాయి అంటే ద్రవిడంలో తల్లి అని అర్థం.. అంటే అమ్మవారు కామాక్షిదేవిని కోరికలు తీర్చే తల్లిగా భక్తులు పూజించుకుంటారు.

కామాక్షి దేవి ఆలయం లోపలికి ప్రవేశించగానే ముందుగా ఎడమవైపు ఉన్న మార్గంలో వెళితే పినాకిని నది ఉంటుంది. ఇక ఆలయ ప్రవేశ ద్వారంలో కామాక్షి తాయి సన్నిధికి వైపు వెళ్లే మార్గంలో ద్వారపాలకులు కొలువై ఉంటారు. ద్వారపాలకులు శూలంతో మనకు దర్శనమిస్తారు. అనంతరం విశాలమైన లోగిలి ఉంటుంది. దానిని దాటి ముందుకు వెళితే కల్యాణ మండపం కనిపిస్తుంది. కల్యాణ మండపానికి కుడివైపు కామాక్షి దేవి గర్భ గుడికి వెళ్లే దారిలో బలిపీఠం, ధ్వజస్తంభం.. దాని ముందు పెద్ద నంది.. దాని పక్కన మర చిన్ననంది ఉంటాయి. వీటన్నింటినీ దాటుకుని లోపలికి వెళితే అర్థమండపం ఉంటుంది. చాలా స్తంభాలతో ఈ అర్థ మండపం ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Share this post with your friends