
హనుమంతుడి వివాహం భౌతిక దేహం లేని సువర్చలతో జరిగింది కాబట్టి ఆయన వ్రత భంగము కాలేదు. విద్యాభ్యాసం సైతం పూర్తైంది. ఇక ఎంత భౌతిక శరీరం లేకున్నా హనుమంతుడితో సువర్చల వివాహం అయితే జరిగింది కాబట్టి సువర్చలను హనుమంతుడి భార్యగా హిందూ పురాణాలు అభివర్ణిస్తున్నాయి. అందుకే అరుదుగా హనుమంతుడు తన భార్య సువర్చలతో కలిసి దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటి అరుదైన ఆలయమే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందులో ఉంది.
ఈ ఆలయాన్ని దంపతులు దర్శించుకుంటే మంచిదట. సతీసమేతంగా హనుమ వెలిశాడు కాబట్టి ఈ ఆలయాన్ని దంపతులిద్దరూ దర్శించుకుంటే వారివురి మధ్య ఏమైనా సమస్యలున్నా.. గొడవలున్నా తొలగిపోతాయని నమ్మకం. దంపతులిద్దరూ అన్యోన్యంగా గడుపుతారట. అలాగే ఆంజనేయుడిని దర్శిచుకోవడం వలన శని బాధల నుంచి విముక్తి పొందడమే కాకుండా సమస్యలను ఎదుర్కోగలిగే శక్తి, విజయం లభిస్తాయని నమ్మకం. ఈ నమ్మకంతోనే ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైత భక్తులు వస్తుంటారు.
