కుంభకోణంలోని శ్వేత వినాయకుడు ఎలా భూమిపైకి వచ్చి సెటిల్ అయ్యాడో తెలుసుకున్నాం కదా. ఈ వినాయకుడు అభిషేకాలెరుగని వినాయకుడు. ఇక్కడ వినాయకుడి విగ్రహానికి అభిషేకాల వంటివి ఉండవు. అలాగే పూలు, కుంకుమ, పసుపుతో దేనితోనూ అర్చన చేయరు సరికదా.. వస్త్రాలు కూడా కట్టరు. అసలు ఈ శ్వేత వినాయకుడిని పొరపాటున కూడా తాకరు. కేవలం వినాయకుడిపై పచ్చ కర్పూరం పొడిని చల్లుతారంతే.. కారణం ఏమీ లేదు. ముందగానే చెప్పుకున్నాం కదా.. ఇక్కడి వినాయకుడు సాగర మథనం సమయంలో పాల నురగతో తయారైన వినాయకుడని.. అదే కారణం.

సముద్ర నురగతో తయారు కావడం వల్ల ఆ విగ్రహాన్ని తాకితే మాయమవుతుందనే భావనతో ఎవరూ విగ్రహాన్ని తాకరట. ఇక ఇక్కడ శివపార్వతులు కూడా కొలువుదీరారు. మరి తమ కుమారుడిని విడిచి ఉండలేకో.. మరో కారణమో కానీ శివపార్వతులిద్దరూ ఈ ఆలయంలో పూజలందుకుంటున్నారు. అంతేకాదు. ఈ ఆలయంలో శివుడు ప్రధాన దైవంగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ పరమేశ్వరుడిని కపర్దీశ్వరర్‌గానూ.. పార్వతి దేవిని ‘పెరియనకై దేవత’ అని పిలుస్తారు. ఈ ఆలయ మరో విశేషం ఏంటంటే.. ఈ ఆలయానికి సమీపంలో కావేరీ నది ప్రవహిస్తుంటుంది.
