ఇవాళే మాస శివరాత్రి.. పూజా సమయాలు ఏంటంటే..

ఈసారి మాస శివరాత్రి రోజున సర్వార్థ సిద్ధి యోగం కూడా రానుంది. కాబట్టి ఆ రోజున భార్యాభర్తలు కలిసి శివుడిని ఆరాధిస్తే వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుందట. ఇక శివుడికి రుద్రాభిషేకం చేస్తే విశేష పుణ్యం లభిస్తుంది. ఆషాడ మాస శివరాత్రి తిథి ఎప్పుడంటారా? పంచాంగం ప్రకారం.. ఇవాళ (ఆగస్ట్ 2) మధ్యాహ్నం 3:26 గంటలకు ప్రారంభమై.. రేపు మధ్యాహ్నం 3:50 గంటలకు ముగుస్తుంది. మాస శివరాత్రి రోజున శివుడికి రుద్రాభిషేకం చేయడం చాలా మంచిదని చెబుతారు. తద్వారా జీవితంలోని అన్ని రకాల ఇబ్బందుల నుంచి గట్టెక్కుతామని నమ్మకం.

మాస శివరాత్రి రోజున నియమ నిష్టలతో శివునికి రుద్రాభిషేకం చేయాలి. అలా చేసిన భక్తులకు రెట్టింపు పుణ్యఫలాలను శివయ్య ఇస్తాడని నమ్మకం. అంతేకాకుండా ఇవాళ శివుడిని పూజించడం వల్ల సంతోషం, సంపద పెరుగుతుందట. ఇక ఇవాళ మొదటి ప్రహార్ పూజ సాయత్రం 07:11 గంటలకు ప్రారంభమై రాత్రి 09:49 వరకు కొనసాగుతుంది. రెండవ ప్రహార్ పూజ రాత్రి 09:49 నుంచి 12:27 వరకూ… మూడవ ప్రహార్ పూజా అర్ధరాత్రి 12.27 నుంచి 03.06 వరకూ… నాల్గవ ప్రహర్ పూజా తెల్లవారుజామున 3.06 నుంచి 05.44 వరకు ఉంటుంది. శివరాత్రి ఉపవాసం ఉన్న వారు రేపు సాయంత్రం విరమించాలి.

Share this post with your friends