నగర్ సెథాని మాత విగ్రహ ప్రతిష్ట వెనుకున్న కథ ఏంటంటే..

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నగర్ సేథాని మాత గురించి చెప్పుకున్నాం కదా. అమ్మ దగ్గర రూ.10 కోట్ల విలువైన ఆభరణాలు, రత్నాలు ఉన్నాయి. నగర్ సేథాని అని పిలువబడే దుర్గమ్మ విగ్రహాన్ని బుందేల్‌ఖండ్ శైలిలో రూపొందించారు. ఈ విగ్రహాన్ని నగలతో అలంకరించిన సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు వస్తారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో నడవడం కూడా కష్టమవుతుంది. జబల్‌పూర్‌లో ఈ దుర్గమ్మ పూజ ఈనాటిది కాదు.. బ్రిటీష్ కాలం నుంచి కొనసాగుతోంది. 156 ఏళ్ల క్రితం బెంగాల్ నుంచి జబల్పూర్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పని చేసేందుకు కొందరు వచ్చారు. వారు బెంగాల్‌లో స్థిరపడ్డారు.

బెంగాల్ నుంచి జబల్పూర్‌కు వచ్చిన వారంతా బెంగాలీ క్లబ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో వీరంతా నవరాత్రుల సమయంలో దుర్గా మండపాలను ఏర్పాటు చేసేవారు. అయితే అమ్మవారి దర్శనానికి నగరంలోని సాధారణ ప్రజలను వారు అనుమతించేవారు కాదట. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన వ్యాపారులను సైతం వారు అనుమతించలేదట. ఆ కోపంతో వ్యాపారులంతా కలిసి సరిగ్గా 156 ఏళ్ల క్రితం సరఫాలో దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించడం ఆరంభించారు. ఈ అమ్మవారిని నగర్ సెథాని మాతగా పిలుచుకునేవారు. ఇదే నాన్ బెంగాలీలు ప్రతిష్టించిన తొలి దుర్గాదేవి విగ్రహం. ఈ సంప్రదాయాన్ని అక్కడి వారు నేటికీ కొనసాగిస్తారు. విగ్రహం అలంకరణ విషయంలోనూ నాటి నుంచి నేటి వరకూ ఎలాంటి మార్పూ లేదు.

Share this post with your friends