
శ్రీలంక తూర్పు తీరంలో ట్రింకోమలీలో ఉన్న శాంకరీ క్షేత్ర విశేషాల గురించి తెలుసుకుందాం. శాంకరి దేవి ఆలయాన్ని కొన్ని శతాబ్దాలకు పూర్వమే నిర్మితమైంది. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల ఈ ఆలయం ధ్వంసమైంది. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉండగా.. దీనికి సమీపంలోనే త్రికోణేశహవర స్వామి అనే శివాలయం ఉంది. దీని పక్కనే కొత్త ఆలయాన్ని ఒక రాతి కొండపై చదునైన ప్రదేశం మీద ఉంది. ఈ ప్రదేశాన్ని ‘రావణన్ వీడు’ అని పిలుస్తారు. అయితే పోర్చుగీసు వారి ఆక్రమణదారుల నుంచి త్రికోణేశహవర, శాంకరీ దేవి దేవతలను రక్షించడానికి ఆ విగ్రహాలను ఒక బావిలో దాచారు.
1948లో శ్రీలంకకు స్వాతంత్య్రం వచ్చింది. ఆ తరువాత ట్రినోలో బావిలో దాచి ఉంచిన విగ్రహాలను వెలికి తీశారు. 1952లో స్థానిక హిందూ, తమిళ ప్రజలు కలిసి శాంకరీ దేవి ఆలయాన్ని నిర్మించారు. బావిలో నుంచి వెలికితీసిన విగ్రహాలను ఆలయంలో ప్రతిష్టించినట్లుగా తెలుస్తోంది. ఈ కొండ హిందూ మహాసముద్రం పైన ఉన్న కొండ అంచులో ఉంటుంది. ఈ కొండ అంచునకు సమీపంలోని పవిత్రమైన బిల్వ వృక్షం ఉంది. గర్భాలయంలో శాంకరీ దేవి మతుమై అంబాల్ రూపంలో పూజలందుకుంటోంది. శివుడి ఆనతితో శాంకరీ ఆలయాన్ని పార్వతీదేవికి ఓ రాజభవంతిలా విశ్వకర్మ నిర్మించి ఇచ్చాడని చెబుతుంటారు.
