అక్కడి వినాయకుడి విగ్రహం నేల నుంచి ఉద్భవించిందట..

చింతామణి ఆలయాన్ని పర్మార్ రాజవంశ రాజులు నిర్మించారని చెప్పుకున్నాం కదా. ఈ ఆలయ నిర్మాణం గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఈ ఆలయం నాగర నిర్మాణ శైలిలో నిర్మించారు. ఆసక్తికరంగా ఆలయ శిఖరాలు లేదంటే.. మధ్య గోపురం ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడి వినాయకుడు స్వయంభువుగా చెబుతారు. ఈ విగ్రహం నేల నుంచి ఉద్భవించిందట. స్వామివారు ఆలయ గర్భగుడిలో సిద్ది బుద్దిలతో కలిసి పూజలందుకుంటూ ఉంటాడు. చింతాహరన్ అంటే మనకు తెలిసిందే. చింతామణి అంటే ఒక విలువైన మాయా రత్నం. దీనికి కోరికలన్నింటినీ నిజం చేసే శక్తి ఉంటుందట.

ఇక మధ్యప్రదేశ్‌కు చెందిన వారంతా తమ ఇంట పిల్లలకు వివాహం నిశ్చయమైతే ఆహ్వాన పత్రికలను బంధువులు, స్నేహితులతో పాటు చింతామణి గణేశుడికి సైతం ఇస్తారు. తమ పిల్లల పెళ్లిలో ఎలాంటి అడ్డంకులు ఎదురు కాకూడదని స్వామివారిని వేడుకుంటారు. ఈ ఆలయానికి వెళ్లే భక్తుడు తన చేతిలో సెల్‌ఫోన్ లేకుండా మాత్రం వెళ్లడు. ఆలయంలోని పూజారి వద్ద ఒక ఫోన్ ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి ఈ పూజారికి భక్తులు కాల్ చేస్తారు. తమ సమస్యలను దేవుడికి చెప్పుకుంటాడు. ఈ ఆలయానికి వెళ్లాలనుకునే వారి కోసం ఇండోర్, భోపాల్‌ నుంచి బస్సులో వెళ్లవచ్చు.

Share this post with your friends