
విజయవాడ ఉండవల్లిలోని గుహాలయంలో అనంత పద్మనాభుడిని ఎప్పుడు దర్శించుకోవచ్చో తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఏడున్నర నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు స్వామి దర్శనం ఉంటుంది. ఒక్క శనివారం రోజు మాత్రం పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులంతా పసుపు, కుంకుమలను తీసుకొచ్చి స్వామివారిపై చల్లుతారు. దీంతో నల్లని అనంత పద్మనాభుని రూపం ఎర్రగా మారిపోయి, ఎర్ర గ్రానైట్‌తో చెక్కిన శిల్పమేమో అని మనకు అనిపిస్తుంది.
శ్రీ అనంత పద్మనాభుడి గుహాలయంలో మరో విశేషం కూడా చూడవచ్చు. అదేంటంటే. మందిరంలోని అనంత పద్మనాభుడి పరిశీలనగా గమనిస్తే స్వామితో పాటు ఎన్నింటినో దర్శించుకోవచ్చు. పద్మం నుంచి ఉద్భవించిన బ్రహ్మ, ఆనందంలో స్వామివారిని కీర్తిస్తున్న దేవతలు, ధ్యానంలో ఉన్న రుషులు, ఆయుథ పాణులైన అంగరక్షకులు, గగనంలో నర్తిస్తున్న గరుత్మంతుడిని మనం దర్శించుకోవచ్చు. అలాగే మూడో అంతస్తులో మండపానికి వెలుపల నాగబంధం ఉంటుందని చెబుతారు. కాబట్టి ఈ పరిసరాల్లో ఎక్కడో విలువైన సంపద ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది.
