Unknown Facts About Samakka-Saralamma Jatara : సమ్మక్క సారలమ్మ జాతర గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర కేవలం పండుగ కాదు… అది త్యాగం, వీరత్వం, భక్తికి నిలువెత్తు చిహ్నం. అడవుల్లో పుట్టిన చిన్నారి సమ్మక్క వనదేవతగా ఎదిగి, గిరిజన రాజ్య స్వాతంత్య్రం కోసం కాకతీయులకే ఎదురునిలిచిన వీరనారి. కరవుకాలంలో కట్టం కట్టలేమన్నందుకు జరిగిన యుద్ధంలో పగిడిద్దరాజు, సారలమ్మ, జంపన్న వీరోచితంగా పోరాడి అమరులయ్యారు. కుటుంబాన్ని కోల్పోయిన సమ్మక్క శత్రుసేనలను ఎదుర్కొని చివరకు చిలకలగుట్టపై అంతర్థానమై.. కుంకుమ భరిణ రూపంలో దర్శనమిచ్చింది. ఆ మహిమ ముందు కాకతీయ రాజు ప్రతాపరుద్రుడే తలవంచాడు. రెండేళ్లకోసారి మాఘ పౌర్ణమి నాడు జరిగే ఈ జాతరలో అమ్మవార్లు గద్దెలపై కొలువుతీరితే… కోట్లాది భక్తుల హృదయాలు భక్తితో కంపిస్తాయి. మేడారం జాతర అంటే దేవతల దర్శనం కాదు… త్యాగానికి నిదర్శనం కూడా.

Unknown Facts About Samakka-Saralamma Jatara
Unknown Facts About Samakka-Saralamma Jatara
Share this post with your friends