చిత్రకూటంలోని రామ మందిర విశేషాలేంటంటే..

పితృవాక్య పరిపాలన కోసం శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడం గురించి తెలిసిందే. ఆ సమయంలో 11 సంవత్సరాల పాటు ఈ చిత్రకూటంలో నివసించాడట. ఈ విషయాన్ని వాల్మీకి తన రామాయణ మహాకావ్యంలో వివరించారు. చిత్రకూట్ అనేది ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ మధ్య ఉంది. ఇక్కడ శ్రీ రాముడికి చెందిన అనేక ఆలయాలతో పాటు సీతమ్మకు సంబంధించిన జానకి కుండ్ కూడా ఉంది. ఈ తటాకంలోనే సీతమ్మ తల్లి స్నానమాచరించేవారని.. అందుకే దీనికి జానకీ కుండ్ అని పేరు వచ్చిందని చెబుతారు. ఈ పవిత్ర ప్రదేశంలో శ్రీ రాముడు, సీతమ్మ తల్లి పాదముద్రలు కూడా దర్శించుకోవచ్చు.

చిత్రకూటంలోని రామ మందిర విశేషాలేంటంటే..
చిత్రకూటంలోని రామ మందిర విశేషాలేంటంటే..

 

భద్రాద్రితో రామయ్యకు ఉన్న అనుబంధం ఏంటంటే..

రామాయణంతో ముడిపడిన ప్రదేశాల్లో తెలంగాణలోని భద్రాచలం కూడా ఒకటి. అసలు భద్రాద్రితో రామయ్యకు ఉన్న అనుబంధం ఏంటంటారా? తెలుసుకుందాం. తెలుగు వారికి పెద్దగా పరిచయం అవసరం లేని పుణ్యక్షేత్రం భద్రాచలం. దీనిని దక్షిణాది అయోధ్యగా పిలుస్తారు. ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధిగాంచింది. సీతమ్మను రావణాసురుడు ఎత్తుకెళ్లాడు. అప్పుడు శ్రీరాముడు సీతమ్మను రక్షించేందుకు లంకకు పయనమైనప్పుడు గోదావరి నదిని దాటి ఈ ప్రదేశంలోనే ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడి గోదావరి నది ఒడ్డున ఈ ఆలయాన్ని నిర్మించారని అంటారు. ఈ మందిరాన్ని శ్రీ రామదాసుగా ప్రసిద్ధి గాంచిన కంచర్ల గోపన్న నిర్మించాడు. ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందట.

Share this post with your friends