గురువాయూర్‌లోని శ్రీకృష్ణుడిని ముఖ్యంగా ఎవరు దర్శించుకుంటారో తెలుసుకుందాం. అనారోగ్యాల బారిన పడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు శాశ్వతంగా విముక్తి పొందిన కథలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు దేశవిదేశాల నుంచి స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. ఆరతు పండుగ సమయంలో పది రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ పది రోజుల పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో కేరళ సాంప్రదాయ నృత్య రీతి కథాకళి శైలిలో శ్రీకృష్ణుని జీవిత చరిత్రను తెలిపే కార్యక్రమం ప్రధాన ఆకర్షణ.

భాగవతాన్ని మలయాళంలో మేళపతూర్ నారాయణ భట్టతిరి అనువదించారు. దీన్నే నారాయణీయమని.. దీన్ని పూర్తిగా పారాయణ చేయడం వలన సమస్త రోగాలు దూరమవుతాయని విశ్వాసం. గురువాయూరప్పను దర్శించి అనారోగ్య సమస్యల నుంచి శాశ్వతంగా విముక్తి పొందిన భక్తుల కథలు కోకొల్లలు. అందువల్లనే దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవారు దేశవిదేశాల నుంచి గురువాయూరప్ప దర్శనం కోసం తరలి రావడం విశేషం. కేరళ రాష్ట్రం త్రిశూర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. ఇహంలో సుఖ సంతోషాలు, పరంలో మోక్షాన్ని ప్రసాదించే గురువాయూర్ క్షేత్రాన్ని దర్శించుకోవడం వలన భక్తులకు అలౌకికమైన ఆనందాన్ని కలిగిస్తుంది.
