కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రపాలుడు, ఆ శ్రీలక్ష్మీ సమేత వేంకటేశ్వర స్వామి కృపను పొందేందుకు తిరుమలకు వెళ్లాల్సిన అవసరమే లేదు. స్వామివారి నామస్మరణ చాలట. నిత్యం అత్యంత పవిత్రమైన “శ్రీ వేంకటేశ్వర స్తోత్రం” పారాయణ చేస్తే చాలు స్వామివారి కృప మనపై ఎప్పుడూ ఉంటుంది. నిత్యం ఈ దివ్య స్తోత్రాన్ని ఆలకించడమో.. పారాయణ చేయడమో చేస్తే మనసులోని ఆందోళనలు, ఒత్తిడి తొలగిపోయి, ఇంటా బయటా అద్భుతమైన ప్రశాంతత ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. ఆ ఏడుకొండలస్వామి నామస్మరణ మనకు ధైర్యాన్ని, సన్మార్గంలో నడిచే ఆత్మీయ శక్తిని ప్రసాదిస్తుంది.

హనుమంతుడి అనుగ్రహం పొందాలంటే..
సాక్షాత్తు ఆ శ్రీరామ భక్తుడైన హనుమంతుని అనుగ్రహాన్ని ప్రసాదించే శక్తివంతమైన మంత్రం “ఓం శ్రీ హనుమతే నమః”. దీనిని నిత్యం అరగంట పాటు స్మరిస్తూ జపం చేయాలి. లేదంటే ఆ మంత్రాన్ని ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని విన్నా చాలని చెబుతారు. నామస్మరణను నిశ్చల మనస్సుతో ఆలకించడం వల్ల మనస్సులోని సకల భయాలు, ఆందోళనలు తొలగిపోతాయి. పారమైన ఆత్మస్థైర్యం, ధైర్యం, కార్యసిద్ధి చేకూరుతాయి. ప్రశాంతత, అద్భుతమైన సానుకూల శక్తి ఏర్పడతాయి. ఆ ఆంజనేయ స్వామి కృపాకటాక్షాల కోసం, మీ నిత్య పారాయణలో భాగంగా స్వామివారి పవిత్ర మంత్ర జపాన్ని పారాయణ చేయడమో.. వినడమో చేయండి.
