భగవద్గీత తొమ్మిదో అధ్యాయం అసూయ గురించి ఏం చెప్పిందంటే..

ఏనాడూ అసూయకు లోబడని స్థితప్రజ్ఞులు లోకంలో ఎప్పుడూ ఉంటారు. ‘లోకంలో ఉన్నదంతా నాలోనూ ఉంది… నాలో లేనిది లోకంలో మరెక్కడా ఉండదు’ అని చెప్పిన మహాభారతం- అసూయాగ్రస్తుల గురించే కాదు, లేని వారి గురించి కూడా చెప్పింది. ఎక్కడంటే- భగవద్గీత తొమ్మిదో అధ్యాయంలో! ‘అర్జునా! అత్యంత రహస్యమైన, లోకోత్తరమైన జ్ఞానాన్ని వేరెవరికో కాకుండా నీకే ఎందుకు ఉపదేశిస్తున్నానో గ్రహించావా? ఎందుకంటే- నీ మనసులో అసూయకు తావులేదు కాబట్టే!’ అన్నాడు గీతాచార్యుడు- తొలి శ్లోకంలో. అంటే మనిషిలో జ్ఞానం వికసించాలంటే తొలుత మనసులోంచి అసూయ తొలగిపోవాలి.

భగవద్గీత తొమ్మిదో అధ్యాయం అసూయ గురించి ఏం చెప్పిందంటే..
భగవద్గీత తొమ్మిదో అధ్యాయం అసూయ గురించి ఏం చెప్పిందంటే..

తనలోని గుజ్జు, పోగులు వగైరా చెత్తంతా మాడి మసైపోయిన తర్వాతే – వెదురుకు వేణువయ్యే అవకాశం చిక్కుతుంది. ఆ పిల్లనగ్రోవికి కృష్ణుడి మోవిని చేరే భాగ్యం దక్కుతుంది. అసూయతో నిండిన మనసులో జ్ఞానానికి చోటుండదు. కాబట్టి భారతాన్ని మనం ఎందుకు చదువుకోవాలంటే- మనం సుయోధనుడికో, లేదా కౌరవపత్నులకో చేరువగా ఉంటున్నామా… లేక అర్జునుడి దారిలో ప్రయాణిస్తూ, అసూయను జయించి కృష్ణుడికి దగ్గరవుతున్నామా… అనేది తేల్చుకోవడానికి! కాబట్టి భారతాన్ని చదవాలని పండితులు చెబుతారు. రెండోవైపుగా చేసే ప్రయాణంలో ఇటు ఆరోగ్యం, అటు జ్ఞానం రెండూ సొంతమవుతాయి కాబట్టి ఏం చేయాలనేది వారే నిర్ణయించుకోవాలి.

Share this post with your friends