ఏదైనా ఆపద కలిగినా, ఆందోళన కలిగినా, భయం వేసినా.. సమస్యను జయించే శక్తి కావాలన్నా మనం హనుమంతుడిని తలచుకుంటాం. ఎలాంటి ఆపదనైనా ఇట్టే తొలగించే దైవంగా మనం హనుమంతుడిని పూజించుకుంటాం. అలాంటి ఆంజనేయ స్వామి ఆలయాలు ప్రతి గ్రామంలోనూ ఉంటాయి. అయితే ఒక గ్రామంలోని ఆంజనేయ స్వామి సమస్యలను జయించే శక్తి, ధైర్యంతో పాటు ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు అప్పులు సైతం ఇస్తాడట. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఏదైనా ఆర్థిక కష్టం వచ్చినప్పుడు.. చేతిలో డబ్బు లేకుంటే అప్పులు చేయడం సహజం. ఎక్కడో చేయడమెందుకు తానే అప్పు ఇస్తానంటాడు ఈ ఆంజనేయడు.

మరి అప్పులు ఇచ్చే ఆంజనేయుడు ఎక్కడ కొలువై ఉన్నాడంటారా? మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లా, బిబడోడ్ గ్రామంలో వెలిశాడు. ఈ హనుమంతుడి దర్శించుకుంటే ధైర్యం, శక్తి మాత్రమే కాకుండా అవసరానికి తగిన అప్పు కూడా సమకూరుతుందట. కలియుగంలో శ్రీ వేంకటేశ్వరస్వామి తన కల్యాణం కోసం కుబేరుని వద్ద అప్పు చేసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన వడ్డీని కుబేరుడికి వేంకటేశ్వర స్వామి ఇప్పటికీ చెల్లిస్తున్నాడని చెబుతారు. ఇక మధ్యప్రదేశ్‌లో వెలసిన ఈ హనుమంతుడు వడ్డీ చెల్లింపులు లేవు కానీ అప్పులు మాత్రం ఇస్తుంటాడు. అది కూడా తన భక్తులకే. అవసరాల నిమిత్తం అప్పులు ఇస్తాడంట. ఇదే ఇక్కడి ప్రత్యేకత.
