Dhyana Anjaneya Swamy : ధ్యాన హనుమంతుడి గురించి తెలుసా?

ఆంజనేయస్వామికి దేశంలోని ప్రతి గ్రామంలోనూ ఆలయం తప్పనిసరిగా ఉంటుంది. శక్తి, ధైర్యం కోసం ప్రతి ఒక్కరూ స్వామివారిని పూజించుకుంటారు. హనుమంతుడి ఒక్కో ఆలయం వెనుక ఒక్కో గాథ ఉంటుంది. అయితే ఒక ఆలయం వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది. ఆసక్తికరంగా ఒకచోట ఔరంగజేబునే గడగడలాడించిన హనుమంతుడు ఉన్నాడని తెలుసా? ఆయనను ధ్యాన హనుమంతుడిగా పేర్కొంటారు. మరి ధ్యాన హనుమంతుడు వెలసిన ప్రదేశం ఎక్కడుంది? ఆ ఆలయం ఎక్కడుందో తెలుసుకుందాం. ఇక్కడ హనుమంతుడు ఎలా కనిపిస్తాడో తెలిస్తే షాక్ అవుతారు. ఇక్కడ హనుమంతుడు ధ్యాన హనుమంతుడిగా దర్శనమిస్తాడు.

 Dhyana Anjaneya Swamy
Dhyana Anjaneya Swamy

నిత్యం శ్రీరామ ధ్యానంలో ఈ హనుమంతుడు ఉంటాడట. కాబట్టి ఈ హనుమంతుడిని ఆరాధిస్తే అన్ని రకాల భూత ప్రేత పిశాచ భయాలు పోగొడతాడని విశ్వాసం. ధ్యానముద్రలో స్వయంభువుగా ఆంజనేయస్వామి ఎక్కడ వెలిశాడో తెలుసా? మరెక్కడో కాదు.. హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో.. ఇక్కడి కొలువైన ధ్యాన ఆంజనేయస్వామి ఎన్నో వందల ఏళ్ల నుంచి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడి హనుమంతుడిని దర్శించుకున్న వారికి ఎలాంటి కష్టాలు ఉండవని నమ్మకం. ముఖ్యంగా ఇక్కడ వాహన సేవలు భారీగా జరుగుతుంటాయి. కొత్తగా వాహనం కొనుక్కున్న వారు కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి ఆలయంలో వాహన పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

Share this post with your friends