History Of Karmanghat Hanuman Temple : కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి ఆలయ చరిత్ర ఏంటంటే..

కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబునే గడగడలాడించాడని చెబుతారు. ఆ కథేంటో తెలుసుకుందాం. క్రీ.శ. 1148లో కాకతీయ సామ్రాజ్యాన్ని రెండో ప్రతాప రుద్రుడు పరిపాలించేవాడు. ఆ సమయంలో ప్రతాపరుద్రుడు వేటాడుతూ ఈ ప్రాంతానికి వచ్చాడు. వేటాడి అలిసిపోయిన రుద్రుడు ఇక్కడ ఉన్న ఒక బండపై సేదతీరిన ఆయనకు కి ఒక పులి గాండ్రింపు వినిపించింది. వెంటనే అప్రమత్తమైన రుద్రుడు విల్లంబులు ధరించి శబ్దం వచ్చిన వైపుగా వెళ్లి చూశాడు కానీ అక్కడ ఏమి కనిపించకపోవడంతో తిరిగి వచ్చి విశ్రమించాడు. మరికాసేపటికి తిరిగి పులి గాండ్రింపు వినిపించింది. అప్పుడు ఆ ప్రాంతమంతా క్షుణ్ణంగా గాలించాడు.

History Of Karmanghat Hanuman Temple
History Of Karmanghat Hanuman Temple

అక్కడ ఎలాంటి జంతువు కనిపించదు కానీ రామ శబ్దం మాత్రం వినిపించడంతో వెంటనే రుద్రుడు భక్తితో చేతులు జోడించి ఆ అదృశ్యమూర్తిని ప్రార్ధిస్తాడు. ధ్యానం చేస్తే దర్శనమిస్తానని ఆ అదృశ్య మూర్తి స్వరం వినిపిస్తుంది. దాంతో రుద్రుడు అక్కడే దీక్షతో ధ్యానం చేయడం మొదలు పెట్టగా ఏవో మాటలు వినిపించాయట. అప్పుడు ప్రతాపరుద్రుడు కళ్లు తెరిచి చూడగా.. ధ్యానముద్రలో ఉన్న ధ్యానాంజనేయస్వామి విగ్రహం కనిపించిందట. దీంతో పరమానందభరితుడైన ప్రతాపరుద్రుడు ఆ విగ్రహానికి పూజలు చేసి తన మందిరానికి తీసుకుని వెళ్లాడు. కలలో ధ్యానాంజనేయస్వామి ఆయనకు కనినిపించి తనకు ఆలయం నిర్మించమని చెప్పాడట. దీంతో ప్రతాపరుద్రుడు ఆలయాన్ని నిర్మించాడని చరిత్ర చెబుతోంది.

Share this post with your friends