Hatakeswaram Temple History : పగిలిన కుండలో వెలసిన పరమేశ్వరుడు… హటకేశ్వరం అద్భుత రహస్యం

శ్రీశైలానికి సమీపంలో ఉన్న హటకేశ్వరం పరమేశ్వరుడి అపార కరుణకు నిలువెత్తు నిదర్శనం. మహాశివభక్తుడైన కుమ్మరి కేశప్ప భక్తులకు అన్నదానం చేస్తూ జీవితం గడిపేవాడు. ఇరుగు పొరుగు వారి అసూయతో అతని జీవనాధారం నాశనం అయిన వేళ, భక్తులకు సేవ చేయలేకపోతున్నాననే బాధ అతన్ని కలచివేసింది. ఆ ఆవేదనను చూసిన పరమేశ్వరుడు పగిలిన కుండ పెంకులో స్వయంగా ప్రత్యక్షమై కేశప్పను కరుణించాడు. అప్పటి నుంచి తిరిగి కేశప్ప అన్నదానం చేయడం మొదలుపెట్టాడు. అటికెలో వెలసిన ఈశ్వరుడు అటికేశ్వరుడిగా, కాలక్రమేణా హటకేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు. స్వయంభూలింగంగా విరాజిల్లే ఈ క్షేత్రం భక్తులకు ఆరోగ్యం, శాంతి, కృపను ప్రసాదిస్తుందని విశ్వాసం. శ్రీశైలం యాత్రకు హటకేశ్వరం దర్శనం సంపూర్ణతను చేకూరుస్తుంది.

Hatakeswaram Temple History
Hatakeswaram Temple History
Share this post with your friends