Famous Kalabhairava Temples : గ్రహదోషాలను తొలగించే కాలభైరవ క్షేత్రాలు ఇవే

కాలభైరవుని దర్శనం ద్వారా గ్రహదోషాలు తొలగిపోతాయని శివపురాణం చెబుతోంది. కాలభైరవాష్టమి మాత్రమే కాకుండా ప్రతి రోజూ భక్తులు భైరవ స్వామిని దర్శించవచ్చు. దేశంలో ప్రసిద్ధ కాలభైరవ ఆలయాల్లో వారణాసి, ఉజ్జయినీ, ఛత్తీస్గఢ్ లోని దంతేవాడ–జగదల్పూర్.. అసోంలోని తేజ్‌పూర్… తెలంగాణలోని ఇసన్నపల్లి… ఆంధ్రప్రదేశ్‌లోని రామగిరి, శ్రీశైలానికి సమీపంలోని భైరవసెల ముఖ్యమైనవి. ఉజ్జయినీ, ఇసన్నపల్లి ఆలయాలు గ్రహపీడలను తొలగించే శక్తివంతమైన ఆలయాలుగా ప్రసిద్ది పొందగా…. ఇసన్నపల్లిలో 7 అడుగుల ఎత్తుతో కాలభైరవ విగ్రహం దిగంబరంగా నిలిచిఉన్న భంగిమలో దర్శనమిస్తుంది. భైరవసెలలో ప్రకృతి అందాలతో కూడిన గుహలో భైరవుడు భక్తులను రక్షిస్తుంటాడు. వీటితో పాటు, నేపాల్ రాజధాని ఖాట్మండులో, ఆంధ్రప్రదేశ్ అడవివరం, ఒంగోలు జిల్లాలోని భైరవకోన ఆలయాలు కూడా ప్రసిద్ది పొందాయి. ఈ ఆలయాల్లో పూజల ద్వారా జీవితంలో సకల గ్రహదోషాలు తొలగిపోతాయనే నమ్మకం భక్తుల్లో ఉండటం విశేషం.

గ్రహదోషాలను తొలగించే కాలభైరవ క్షేత్రాలు ఇవే
గ్రహదోషాలను తొలగించే కాలభైరవ క్షేత్రాలు ఇవే
Share this post with your friends