కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం గురించి తెలుసా?

హనుమంతుడు అక్కడా.. ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా కొలువుదీరాడు. ప్రతి గ్రామంలో.. ప్రతి ఏరియాలో ఒక ఆంజనేయస్వామి క్షేత్రం ఉంటుంది. ఇక కొన్ని చోట్ల హనుమంతుడు మరీ శక్తువంతుడిగా పేర్కొంటారు. గుజరాత్‌లోని సారంగపూర్‌లో ఒక ప్రసిద్ధ ఆంజనేయస్వామి క్షేత్రం ఉంటుంది. ఈ ఆలయాన్ని శ్రీ కష్ట భంజన్ దేవ్ హనుమాన్ ఆలయంగా పేర్కొంటారు. ‘కష్టభంజన్ దేవ్’ అంటే “దుఃఖాన్ని అణిచి వేసేవాడు” అని అర్థం. స్వామి నారాయణ సంప్రదాయంలోని వడ్తాల్ గడిలో ఒక భాగమే.. శ్రీ కష్ట భంజన్ దేవ్ హనుమాన్ ఆలయం.

కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం గురించి తెలుసా?
కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం గురించి తెలుసా?

ఇక్కడ వెలసి ఉన్న ఆంజనేయుడు భక్తుల కష్టాలను తొలగిస్తాడని నమ్మకం. కాబట్టి ఈ ఆలయానికి ఈ పేరు వచ్చింది. ముందుగా ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. శ్రీ కష్టభంజన్‌దేవ్ విగ్రహాన్ని అత్యంత మహిమాన్వితమైనదిగా పేర్కొంటారు. ఈ విగ్రహాన్ని ఆలయంలో గోపాలానందస్వామి ప్రతిష్టించాడని చెబుతారు.

ఒకానొక సమయంలో గోపాలానంద స్వామి ఒక దండంతో విగ్రహాన్ని తాకాడట. అయితే ఆ విగ్రహం సజీవమై కదిలి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసిందని చెబుతారు. దుష్టశక్తులతో పీడితులైనవారు ఇక్కడి హనుమంతుడిని దర్శించిన వెంటనే అవన్నీ తొలగిపోతాయని చెబుతారు.

Share this post with your friends