Ramalingeswara Swamy Temple : ఈ ఆలయంలో నీరే మహాప్రసాదం… ఒక్కసారి మునకేస్తే చాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి శివారులో వెలసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం భక్తి, ప్రకృతి, అద్భుతానికి నిలువెత్తు నిదర్శనం. నాలుగు వందల ఏళ్ల చరిత్ర గల ఈ క్షేత్రంలో బండరాళ్ల మధ్య నుంచి నిరంతరం ఉబికి వచ్చే బుగ్గ నీరే మహాప్రసాదం. ఎండలు మండినా, వర్షాలు లేకపోయినా ఈ జలధార ఎప్పుడూ ఎండిపోకపోవడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ నీటిలో స్నానం చేస్తే రోగాలు నయమవుతాయని, పొలాల్లో చల్లితే పంటలకు రక్షణ కలుగుతుందన్న అపార విశ్వాసం ఉంది. మునుల తపస్సు ఫలితంగా ఈ శివలింగం ప్రతిష్టించబడిందని స్థానికుల నమ్మకం. మహాశివరాత్రి వేళ భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయం, ప్రశాంతతను ప్రసాదించే దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఒక్కసారి మునకేస్తే చాలు… శివానుగ్రహం లభిస్తుందన్న భావనతో భక్తులు తరలివస్తారు.

Bugga Ramalingeswara Swamy Temple Special Story
Bugga Ramalingeswara Swamy Temple Special Story
Share this post with your friends