మే 21 నుంచి తుమ్మూరు శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరు గ్రామంలోని శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 29వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందులోభాగంగా మే 20న‌ సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 9 గంటల వరకూ.. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 26వ తేదీ రాత్రి 8.30 గంట‌ల‌కు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

21-05-2024
ఉదయం – ధ్వజారోహణం
సాయంత్రం – శేష వాహనం

22-05-2024
ఉదయం – తిరుచ్చి ఉత్సవం
సాయంత్రం – హనుమంత వాహనం

23-05-2024
ఉదయం – ద్వార దర్శనం
సాయంత్రం – గరుడ వాహ‌నం

24-05-2024
ఉదయం – తిరుచ్చి ఉత్సవం
సాయంత్రం – హంస వాహనం

25-05-2024
ఉదయం – తిరుచ్చి ఉత్సవం
సాయంత్రం – విమాన వాహనం

26-05-2024
ఉదయం – తిరుచ్చి ఉత్సవం,
సాయంత్రం – మోహినీ అవ‌తారం, సింహవాహనం, గజవాహనం, స్వామివారి కల్యాణం.

27-05-2024
ఉదయం – రథోత్సవం
సాయంత్రం – తిరుచ్చి ఉత్సవం

28-05-2024
ఉదయం – తిరుచ్చి ఉత్సవం
సాయంత్రం – పార్వేట ఉత్సవం

29-05-2024
ఉదయం – చక్రస్నానం
సాయంత్రం – ధ్వజావరోహణం

30-05-2024
ఉదయం – అభిషేకం
సాయంత్రం – పుష్పయాగం

Share this post with your friends