Amrita Ghateswara : ఆ శివయ్య అమృత ఘటేశ్వరుడుగా ఎలా మారాడంటే..

పరమేశ్వరుడు ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది రాక్షసులను సంహరించాడు. దీనికి కారణం వారంతా ప్రజాకంటకులుగా మారడమే. అయితే వీరిని సంహరించిన ప్రాంతాల్లో ఆలయాలను నిర్మించడం జరిగింది. ఈ ఆలయాలను విరాటనం అంటారు. వీటిలో ఒక ఆలయం తమిళనాడులో ఉంది. తిరుకడవూర్ ఆలయంలో అమృతఘటేశ్వర్‌గా శివయ్య, అభిరామిగా పార్వతీదేవి కొలువై ఉంది. సాగరాన్ని మథించి దేవతలు అమృతాన్నిసాధించడం గురించి తెలిసిందే. ఆ సమయంలో తొలి ప్రార్థన చేయాల్సిన వినాయకుడిని మరిచిపోయారు.

Amrita Ghateswara
Amrita Ghateswara

అనంతరం దేవతలు అమృతభాండాన్ని తీసుకువచ్చారు. అయితే ఆ సమయంలో తొలిప్రార్థన చేయాల్సిన వినాయకుడిని మరచిపోయారు. దీంతో గణేశుడు ఆ అమృత భాండాన్ని తీసుకెళ్లిపోయాడు. దానిని ఇక్కడకి తీసుకువచ్చి, శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అనంతరం తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల పూజించి.. అభిషేక ప్రియుడైన తన తండ్రి శివయ్య కొలువైన శివలింగంపై అభిషేకించాడట. అలా అక్కడి శివయ్య అమృతఘటేశ్వరుడిగా మారాడు. ఇక్కడి శివయ్యను ఎవరైనా నిండు మనసుతో ప్రార్థించాలే కానీ తప్పక ప్రత్యక్షమవుతాడని చెబుతారు.

Share this post with your friends