ధనధాన్యాలతో తులతూగాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఎందుకంటే డబ్బు లేనిదే జగత్తు లేదు ప్రస్తుత తరుణంలో. ప్రపంచమంతా డబ్బు చుట్టే తిరుగుతోంది. మరి లక్ష్మీదేవి మన ఇంట నడయాడాలంటే ఏం చేయాలి? అంటే దీనికి సంబంధించిన చాలా విషయాలను చెబుతుంటారు. ఇంట్లో వాస్తు దోషం ఉంటే డబ్బు ఉండదని.. కొన్ని వస్తువులను ఇంట్లో పెట్టుకున్నా.. లేదంటే ఇంటి నుంచి కొన్ని వస్తువులను తీసేసినా లక్ష్మీదేవి గడప దాటుతుందని అంటుంటారు. నిజానికి లక్ష్మీదేవిని మన ఇంట్లోనే ఉంచుకోవాలంటే ఏం చేయాలో చాలా గ్రంథాలు చెబుతున్నాయి.
ముందుగా నరదిష్టికి ఎంతటి వారికైనా ఇక్కట్లేనట. కాబట్టి నరదిష్టిని పోగొట్టుకోవాలంటే ఎర్రటి గుడ్డలో పూజ చేసిన కొబ్బరికాయను ఉంచి ఇంటి ముందు కడుతూ ఉంటారు. అలాగే కలబంద చెట్టును సైతం ఇంటి ముందు కడుతుంటారు. ఇక లక్ష్మీ స్వరూపంగా తమలపాకు చెట్టును భావిస్తుంటారు. ఆ చెట్టు ఇంట్లో ఉంటే డబ్బుకి కొదువ ఉండదట. అలాగే మన ఇంట్లో ఒక తాబేలు విగ్రహం ఉన్నా కూడా లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుందట. ఈ విగ్రహం ఉన్న ఇంట సిరి సంపదలకు లోటుండదని పెద్దలు చెబుతుంటారు.