
అయితే ముఖ్యంగా భాద్రపద పౌర్ణమి రోజున ఉమామహేశ్వరులను వ్రత విధానం ద్వారా పూజించడం వలన , ఆదిదంపతులు మరింత ప్రీతి చెందుతారని అంటారు. ఈ రోజున నియమ నిష్ఠలను పాటిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఉమా మహేశ్వరులను ఆరాధించడం వలన సకల సంపదలు ప్రాప్తిస్తాయనీ .. సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఉమా-మహేశ్వర వ్రతం మహిళలకు చాలా ముఖ్యం. దాని ప్రభావంతో, మహిళలు దీర్ఘ సుమంగళీ ప్రాప్తాన్ని సంపాదించుకోవచ్చు. వారికి తెలివైన సంతానంతో పాటు అదృష్టం కూడా వరిస్తుంది.
శివపార్వతి దేవి విగ్రహాన్ని, లేదా పటాన్ని పూజగదిలో వుంది. వారికి ధూపం, దీపం, అత్తరు, పువ్వులు సమర్పించాలి. స్వచ్ఛమైన నెయ్యితో కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. మత్స్య పురాణంలో ఉమా-మహేశ్వర వ్రతం ప్రస్తావించబడింది. ఒకసారి దుర్వాస మహర్షి భగవంతుడు శంకరుని దర్శనం ముగించి తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో శ్రీ మహా విష్ణువును కలిశాడు.శివుడు విష్ణువుకు ఇచ్చిన బిల్వ మాలను ఆయనకు కానుకగా ఇచ్చారు. విష్ణువు దానిని గరుడ మెడలో వేశాడు. ఇది చూసిన మహర్షి దుర్వాసకు కోపం వచ్చి అతన్ని శపించాడు. విష్ణువును హెచ్చరించాడు. శివుడిని అగౌరవపరిచారు. కాబట్టి, శ్రీ మహాలక్ష్మి నుంచి దూరమవుతారని విష్ణువును శపిస్తాడు.
క్షీర సాగరం నుంచి మీరు దూరమవుతారని.. శేషనాగు కూడా మీకు సహకరించదని శపిస్తాడు. ఇది విన్న విష్ణువు గౌరవంగా శాపం నుంmr విముక్తి పొందటానికి పరిష్కారాన్ని అడిగాడు. అప్పుడే దుర్వాస మహర్షి ఉమా-మహేశ్వర వ్రతం ఆచరించాలని ఉపాయం చెప్తాడు. ఆ రోజు ఉపవాసం చేయమని మహర్షి వెల్లడిస్తాడు. అలా ఉమామహేశ్వర వ్రతం ఆచరించిన తర్వాతే శ్రీ మహా విష్ణువు లక్ష్మీదేవిని తిరిగి పొందగలిగాడని పురాణాలు చెప్తున్నాయి. అప్పటి నుంmr భాద్రపద పూర్ణిమా నాడు ఉమామహేశ్వరుల వ్రతం ఆచరణ సాంప్రదాయం వస్తుంది.
