వైశాఖ మాసం ప్రారంభమైంది. దీనిని మాధవ మాసమని కూడా అంటరు. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం కాబట్టి దీనిని మాధవ మాసమని పేర్కొంటారు. వైశాఖ మాసం వరుస పర్వదినాలతో పాటు దానధర్మాలకు ప్రఖ్యాతిగాంచిన మాసమిది. ఈ మాసంలో వచ్చే పర్వదినాలు, పుణ్య తిథుల గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 18, శనివారం వైశాఖ మాసం ప్రారంభమై మే 16 శనివారంతో ముగియనుంది.

పర్వదినాలు, పుణ్య తిధులు
ఏప్రిల్ 18, శనివారం: వైశాఖ శుద్ధ పాడ్యమి, ఈ రోజు నుంచి వైశాఖ మాసం ప్రారంభం.
ఏప్రిల్ 19, ఆదివారం: వైశాఖ శుద్ధ విదియ, చంద్రోదయం
ఏప్రిల్ 20, సోమవారం: వైశాఖ శుద్ధ తదియ, కృత యుగం ప్రారంభం, అక్షయ తృతీయ, సింహాద్రి అప్పన్న చందనోత్సవం, పరశురామ జయంతి, మరకతవల్లి సమేత శ్రీ అగస్త్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, చార్ ధామ్ యాత్ర ప్రారంభం
ఏప్రిల్ 21, మంగళవారం: వైశాఖ శుద్ధ చవితి/ పంచమి, శ్రీ శ్రీ ఆది శంకరాచార్యుల జయంతి
ఏప్రిల్ 22, బుధవారం: వైశాఖ శుద్ధ పంచమి/ షష్టి, రామానుజ జయంతి
ఏప్రిల్ 25, శనివారం: వైశాఖ శుద్ధ నవమి, తిరుమల శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ప్రారంభం
ఏప్రిల్ 26, ఆదివారం: వైశాఖ శుద్ధ దశమి, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి
ఏప్రిల్ 27, సోమవారం: వైశాఖ శుద్ధ ఏకాదశి, సర్వ ఏకాదశి, మోహిని ఏకాదశి, అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం
ఏప్రిల్ 28, మంగళవారం: వైశాఖ శుద్ధ ద్వాదశి, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బుగ్గోత్సవం ప్రారంభం
ఏప్రిల్ 29, బుధవారం: వైశాఖ శుద్ధ త్రయోదశి, దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి తెప్పోత్సవం ప్రారంభం
ఏప్రిల్ 30, గురువారం: వైశాఖ శుద్ధ చతుర్దశి, నృసింహ జయంతి, శరభ జయంతి, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బుగ్గోత్సవం సమాప్తం. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి
మే 1, శుక్రవారం: వైశాఖ శుద్ధ పౌర్ణమి, బుద్ధ పూర్ణిమ, కూర్మ జయంతి, మే డే, దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి వారి తెప్పోత్సవం సమాప్తం
మే 2, శనివారం: వైశాఖ బహుళ పాడ్యమి, అన్నమాచార్య జయంతి
మే 5, మంగళవారం: వైశాఖ బహుళ చవితి, తిరుపతి గంగ జాతర, సంకష్ట చతుర్థి
మే 10, ఆదివారం: వైశాఖ బహుళ అష్టమి, మదర్స్ డే!
మే 11, సోమవారం: వైశాఖ బహుళ నవమి, నిజకర్తరి, హృషీకేశ్ శ్రీ పార్వతీదేవి సమేత చంద్రమౌళీశ్వర స్వామి పాంచాహ్నిక దివ్య కళ్యాణ మహోత్సవం ప్రారంభం
మే 12, మంగళవారం: వైశాఖ బహుళ దశమి, హనుమజ్జయంతి, తిరుపతి గంగ జాతర సమాప్తం
మే 13, బుధవారం: వైశాఖ బహుళ ఏకాదశి, అపర ఏకాదశి
మే 14, గురువారం: వైశాఖ బహుళ ద్వాదశి/ త్రయోదశి, పక్ష ప్రదోషం
మే 15, శుక్రవారం: వైశాఖ బహుళ చతుర్దశి, వృషభ సంక్రమణం, మాసశివరాత్రి
మే 16, శనివారం: వైశాఖ బహుళ అమావాస్య, హృషీకేశ్ శ్రీ పార్వతీదేవి సమేత చంద్రమౌళీశ్వర స్వామి పంచాహ్నిక దివ్య కళ్యాణ మహోత్సవం సమాప్తం.
