అరక్వింటాపైనే ఆభరణాలతో నగర్ సేథాని మాత అలంకారం..

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో దుర్గా దేవిని నగర్ సేథాని మాతగా పూజించుకుంటారని తెలుసుకున్నాం కదా. అమ్మవారిని 156 ఏళ్లుగా ప్రతిష్టించి పూజించడం ఆనవాయితీగా మారిపోయింది. ఇక్కడి అమ్మవారి అలంకరణ చాలా స్పెషల్ అని తెలుసుకున్నాం కదా. అమ్మవారిని మొక్కుకుంటే తప్పక కోరిక నెరవేరుతుందని.. అలా నెరవేరిన వారు అమ్మవారికి కానుకగా.. వెండి, బంగారం, వజ్రం, ముత్యం వంటివి అందజేస్తుంటారని తెలుసుకున్నాం కదా. వీటితోనే అమ్మవారి అలంకరణ జరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. నవరాత్రుల సమయంలో అమ్మవారి విగ్రహంపై బంగారం, వెండి, వజ్రం, ముత్యం , రూబీ ఆభరణాలు అర క్వింటాకు పైనే ఉంటాయట.

ఒక్క అమ్మవారి మెడలోనే మెడలో మంగళసూత్రంతో పాటు ముత్యాల హారాలు, డైమండ్స్‌, బంగారంతో కూడిన అనేక ఆభరణాలు ఉంటాయి. ఇక చేతులకు గాజులతో పాటు బంగారు కవచాలు వంటి ఎన్నో ఆభరణాలు… నడుముకి వడ్డాణం సహా ముత్యాల దండలు.. ఇక పాదాలను చీలమండలకు పట్టీలు, కడియాలు వంటి అనేక ఆభరణాలతో అమ్మవారిని అలంకరిస్తారు. వీటన్నింటి నడుమ అమ్మవారు దగదగా మెరిసిపోతూ ఉంటుందట. పైగా ఆభరణాలన్నింటి నడుమ అమ్మవారు చాలా అందంగా దర్శనమిస్తారు. అమ్మవారికి కోరికలు నెరవేరిన వారు ఆభరణాలు కానుకగా సమర్పిస్తారని ముందుగానే చెప్పుకున్నాం. కాబట్టి అమ్మవారి ఆభరణాల సంఖ్య ప్రతి ఏటా పెరుగతూ ఉంటుంది.

Share this post with your friends