శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోవడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. ఇవాళ ఈ వ్రతాన్ని మహిళలంతా చేసుకుంటున్నారు. ఈ వ్రతం గురించి పార్వతీదేవికి పరమేశ్వరుడు స్వయంగా వివరించాడట. వరలక్ష్మీ వ్రతం ఆచరించిన వారి ఇంట సంపద, సౌభాగ్యం కలకాలం ఉంటాయట. మరి వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? కార్యసిద్ధి, సంసార బంధ విమోచనం వల్ల మోక్షం సిద్ధిస్తుందట. ఈ వ్రతం ఆచరించిన వారు ఆటంకాలన్నింటినీ అధిగమించి విజయం సొంత చేసుకుంటారట.
అలాగే సంపద, శ్రేయస్సు వంటివనీ వరలక్ష్మీ దేవి అందిస్తుందట. ఈ గుణాలన్నింటినీ ఏకకాలంలో పొందడానికి వరలక్ష్మీ వ్రతాన్ని ఉద్దేశించడం జరిగింది. అంతటి విశిష్టమైన వ్రతాన్ని ఆచరిస్తే తప్పక లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందట. ఈ వ్రతం రోజు కథ చదువుతారు. ఈ వ్రత కథను లక్ష్మీదేవే స్వయంగా చారుమతి అనే మహిళకు కలలో కనిపించి వివరించిందట. ఎలాంటి భేదభావాలు లేకుండా అమ్మవారు ప్రతి ఒక్కరినీ కలుపుకుంటూ పోతుందట. అందుకే వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తే తప్పక ఎవరికైనా అమ్మవారి అనుగ్రహం లభిస్తుందట.