
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న రెండు నాగ దేవత ఆలయాల గురించి ఇప్పటికే తెలుసుకున్నాం కదా. ఈ క్రమంలోనే మరో రెండు ఆలయాల గురించి కూడా తెలుసుకున్నాం. నాగ పంచమి నాడు ఈ ఆలయాలను దర్శించుకుంటే నాగ దోషాలన్నీ తొలగిపోయి మంచి జరుగుతుందని నమ్మకం. తమిళనాడులోని కుంభకోణం సమీపంలో తిరునాగేశ్వరం అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో శివాలయం ఉంది. ఈ ఆలయాన్ని దీనిని నాగనాథర ఆలయం లేదంటే రాహు స్థలం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం ఈనాటిది కాదు. చారిత్రక ఆధారాల ప్రకారం చూస్తే దీనిని 7 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయంలో నాగనాథర, రాహు, పిరైసూడి అమ్మన్ ఆలయాలు సైతం ఉపాలయాలుగా ఉన్నాయి.
ఇక మరో ఆలయం.. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో భుజ్ పట్టణంలో ఒక కొండ ఉంది. దీనిపై నిర్మించిన భుజియా కోట పట్టణానికి అభిముఖంగా ఉంటుంది. ఇక్కడ గుహలో ప్రఖ్యాతిగాంచిన నాగాలయం ఉంది. ఈ ఆలయానికి వెళ్లడం అంత సులభమేమీ కాదు.. ఓ సాహసం చేయాల్సిందే. మరో ఆలయం.. కుక్కే సుబ్రహ్మణ్యస్వామివారి ఆలయం. ఇది దక్షిణ కన్నడ జిల్లాలో ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. దీనికో చరిత్ర ఉంది. వాసుకి సహా ఇతర సర్పాలన్నీ గరుడుడి బారిన పడ్డాయట. ఆ సమయంలో సర్పాలన్నీ వచ్చి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఆశ్రయం పొందాయి. ఈ ఆలయం కాలసర్ప దోష నివారణకు ప్రసిద్ధి గాంచింది.
తమిళనాడులో నాగరాజ ఆలయం ఉంది. దీనిని 12 వ శతాబ్దంలో నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయంలో మూడు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. పురాతన ప్రధాన మందిరంలో ప్రధాన దైవంగా నాగరాజు పూజలను అందుకుంటున్నాడు. రెండవ మందిరం రుక్మిణి, సత్యభామలతో కూడిన అనంత కృష్ణ (చుట్టిన పాముపై నృత్యం చేస్తున్న శిశువు కృష్ణుడు )కి అంకితం చేయబడింది. మూడవ మందిరం శివునికి అంకితం చేయబడింది.
